ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలబోనివ్వం: డాక్టర్ పసుపులేటి

  • అధినేత నిర్ణయమే శిరోధార్యం
  • ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్

చిత్తూరు: జనసే, టిడిపి పొత్తు భవిష్యత్ రాజకీయాల్లో పెను ప్రభావం చూపించబోతోందని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఏకైక లక్ష్యంతో తమ అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. ఈమేరకు శుక్రవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. తమ అధినేత చెప్పినట్టు తెలుగుదేశం పార్టీతో పొత్తును స్వాగతిస్తున్నామన్నారు. అధినేత నిర్ణయమే తమకు శిరోధార్యమని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీపై యుద్దం చేసేందుకు రెండు పార్టీల కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ రాష్ట్ర ప్రయోజనాలను ద్రుష్టిలో పెట్టుకొని తమ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రాజకీయ నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, అధికార వైసీపీని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ త్యాగాలకు సిద్దం కావాలన్నారు. రెండు పార్టీలు స్నేహపూరిత వాతావరణంలో అధికార పార్టీని ఇంటికి సాగనంపాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేయాలని ఆయన ఆ ప్రకటనలో పిలుపునిచ్చారు.