కలిగిరిలో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

ఉదయగిరి నియోజకవర్గం: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ వింజమూరు మండలం తరుపున కలిగిరిలో శనివారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో వారికి మద్దతుగా వింజమూరు మండల జనసేన అధ్యక్షులు బండారు సత్యనారాయణ, మండల ఉపాధ్యక్షులు ఎస్. కె సుభాని భాయ్, ప్రధాన కార్యదర్శులు ఎస్. కె ఇమ్రాన్, విజయ్, నాయకులు వెలుగోటి సురేష్, రవి, రాజా జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.