బొమ్మూరులో టిడిపి రిలే నిరాహార దీక్షకు జనసేన మద్దతు

రాజమండ్రి సిటీ: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా బొమ్మూరులో శుక్రవారం రిలే నిరాహార దీక్ష చేస్తున్న శాటిలైట్ సిటీ టిడిపి నాయకులకు శాటిలైట్ సిటీ జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గొడిసిపూడి నాగేంద్ర, జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ పోలూరి శ్రీనివాస్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలుగుబంటి దుర్గారావు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అన్యం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ కార్యదర్శి రెడ్డి కరుణ, జనసేన పార్టీ కార్యదర్శి సేలం సురేష్, జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి కాజా శివరామకృష్ణ, టిడిపి నాయకులకు మద్దతుగా సంఘీభావం తెలిపారు.