ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన వైసీపీ నాయకులు

  • అగ్రహారం పంచాయతీలో నిధులు లేవు అంటున్న అధికారులు
  • నిరూపయోగంగా అగ్రహారం వాటర్ ప్లాంట్

కొండపి నియోజకవర్గం: పొన్నలూరు మండలంలో అగ్రహారం పంచాయతీలో జనసేన పార్టీ నాయకులు పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా వాటర్ ప్లాంట్ మూసి వేయడం వల్ల త్రాగునీటి సమస్య ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ వాటర్ ప్లాంట్ నిరూపయోగంగా ఉంది. రోడ్లకు ఇరువైపులా సైడ్ కాలువలు లేకపోవడం వల్ల ప్రజలకు మరియు విద్యార్థులకు డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు వ్యాపిస్తు ఉన్నాయి. స్కూలుకి నాలుగు వైపులా డ్రైనేజీ సమస్య విపరీతంగా ఉంది. పంచాయతీ కార్యాలయంకి ఎదురుగా నీరు నిల్వ ఉండి చిన్నపాటి చెరువులాగా ఉంది. చిన్నపాటి వర్షం కురిసినా అదేవిధంగా ఇంట్లో నుండి వచ్చే నీరు రోడ్లమీద నిల్వ ఉంటుంది. ఇప్పటివరకు బ్లీచింగ్ పౌడర్ కూడా చల్లలేదు. 8వ వార్డులో విద్యుత్ స్తంభాలు లేవు, విద్యుత్ స్తంభాలకు బల్బులు లేవు, పూడికతీత జరగలేదు, నిరూపయోగంగా చెత్త బండ్లు ఉన్నాయి, చెత్త తీసేటువంటి క్లాపు మిత్ర గాడ్ స్లిప్పర్స్ కు నెలలు తరబడి జీతాలు చెల్లించలేదు, అగ్రహారం పంచాయతీలో ఉన్నటువంటి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్ సోమవారం పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి చౌడూరి ఖాదర్ బాషా, ప్రధాన కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా, కార్యదర్శి సుంకేశ్వరం శ్రీను, కార్యదర్శి ద్రోణాదుల శివకిషోర్, మాల్యాద్రి, నరసింహ, శ్రీనివాసులు, మోహన్, రమేష్ మొదలైన జనసేన నాయకులు పాల్గొన్నారు.