ఘనంగా చాకలి ఐలమ్మ 128వ జయంతి వేడుకలు

తాడేపల్లిగూడెం: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సబ్బండ వర్ణాల దీర వనిత చాకలి ఐలమ్మ 128వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ యువజన అధ్యక్షుడు అత్తిలి బాబి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా నియోజక వర్గ అధ్యక్షులు కేశవబట్ల విజయ్ హజరు అయ్యారు. కేశవబట్ల విజయ్ మాట్లడుతూ తెలుగు రాష్ట్రాల పోరాట పటిమను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప పోరాట యోధురాలు ఐలమ్మ అని, పెత్తందారి వ్యవస్థపై, రజకర్లపై వ్యతిరేఖంగా పోరాడి ఎందరో పోరాట యోధులకు తిరుగుబాటు బావుటా మార్గాన్ని అధించి, దున్నే వాళ్ళదే భూమి మధ్యలో మీ పెత్తనం ఏమిటి అని ఎదిరించి, రజాకార్ల దుర్మార్గాన్ని దైర్యంగా ఎదిరించిన గొప్ప నాయకురాలు ఆమె అని అన్నారు, వారి కుటుంబంపైన జరిగిన దౌర్జన్యాన్ని డైర్యంగా ఎదుర్కొని యావత్ తెలంగాణ ప్రజలకు దైర్యం నూరిపోసిన బహుజన పోరాట యోధురాలు చరిత్రను విస్మరించిన ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తుమరాడ చిన్న మాట్లాడుతూ కాలు మొక్కుత బాంచంద్ దొర అనే నోటితో మీ ఆటలు మాపై సాగవు అని, సలం కొట్టిన చేతులతోనే రజాకార్లపై దాడి చేసిన తొలి తెలంగాణ వీర మహిళ అని, పట్వారీపై, దేష్ ముఖ్ లపై తిరుగు బాటు చేసి సుమారు 95 వేల ఎకరాలు భూమి నీ పేదవారికి పంపిణీ చేసిన గొప్ప విప్లవ కారి అని అన్నారు. ఐలమ్మ జీవితాన్ని ప్రతి మహిళ కూడా ఆదర్శంగా తీసుకొని వారి హక్కులు సాధించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మారీసెట్టి నరసింహమూర్తి, పట్టణ యువజన అధ్యక్షులు చల్లా సుదీర్, నియోజక వర్గ కార్యదర్శి చొప్ప లక్ష్మణ్, బీసీ నాయకులు రామకృష్ణ, సిద్దు, తదితర బీసీ నాయకులు ఐలమ్మకు నివాళులు అర్పించారు.