పెరుగుతోన్న విద్యార్థుల హాజరు శాతం..

కరోనా విజృంభణతో స్కూళ్లు, కాలేజీలు అన్నీ మూతపడ్డాయి.. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో క్రమంగా తెరుచుకుంటున్నాయి.. ఇక, తెలంగాణ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 9 నుంచి పై తరగతుల ప్రారంభానికి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. దీంతో.. సోమవారం నుంచి స్కూళ్లు, ఇంటర్ కాలేజీలు ప్రారంభం అయ్యాయి… అయితే, తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు హాజరు శాతం కొంత మేర పెరిగింది… సోమవారం రోజు 9వ తరగతి విద్యార్థులు 41 శాతం హాజరు కాగా.. 10వ తరగతి 54 శాతం, ఇంటర్‌ విద్యార్థులు 45 శాతం హాజరయ్యారు. ఇక, రెండో రోజు 9వ తరగతిలో హాజరుశాతం 47 శాతానికి పెరగగా.. 10వ తరగతిలో 58 శాతానికి పెరిగింది.. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచే కెజిబివి, మోడల్, తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థుల హాజరు 50 శాతానికి పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది.. మొదటి రోజుతో పోల్చుకుంటే రెండో రోజు విద్యార్థుల శాతం పెరిగిందని వెల్లడించారు అధికారులు. కాగా, మిగతా క్లాసులకు ఆన్‌లైన్‌, టీ-శాట్ ద్వారా యథావిథిగా క్లాసులు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.