ఆదివాసీ హక్కులకు రక్షణ కోసం జనసేన అధికారంలోకి రావాలి

  • ప్రజా సమస్యలు ధ్యేయంగా గ్రామ గ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జనసేన నాయకులు

పాడేరు నియోజకవర్గం: అశేష ప్రజనీకం సమస్యల కోసం జనసేన పార్టీ పర్యటనలో భాగంగా లిగల్ ఎడ్వటైజర్ కిల్లో రాజన్, నందొలి మురళికృష్ణ, సీ.హెచ్ అనిల్ కుమార్. ఈ పర్యటనలో జనసేన పార్టీ లీగల్ ఎడ్వటైజర్ కీల్లో రాజన్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, చట్టాలకి రక్షణ ఉండాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. అలాగే స్థానికంగా సమస్యలు పరిష్కారం అవ్వాలన్నా, ఆదివాసీ మనుగడకి, అస్తిత్వానికి, ఆదివాసీ మహిళలకి రక్షణ కలగాలన్నా, కచ్ఛితంగా జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుంది అని ఈ సందర్బంగా తెలిపారు. అలాగే వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగున్నర ఏళ్లు అయినప్పటికీ యువతికి ఉపాధి అవకాశాలు కాని, విద్య కాని వైద్యం కాని, అభివృద్ధి కాని, నెరవేర్చిన దాఖలాలు లేవు, ఇలాంటి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయారు. ప్రజలు ఓట్లు వేయించుకొని గద్దె ఎక్కిన తర్వాత, ఆదివాసీ జీవన మనుగడకి విఘాతం కలిగించేలా, ఈ రొజు మనకున్నటువంటి జివో లను చట్టాలను పటిష్టంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.. అలాగే మనకి అన్యాయం చేసిందే కాకుండా మనకి రావలసిన గ్రామాలకు, మౌళిక వసతులకు, గ్రామ నిధులను దోచుకున్న ప్రభుత్వంని, అలాగే ఆదివాసీలకి అత్యంత ప్రమాదకరంగా ఈరోజు బోయవాల్మికులని ఎస్టి జాబితాలో చేర్చి కుడా, మన పొట్టన కొట్టాలని ఈ వైసిపి ప్రభుత్వం కంకణం కట్టుకుంది అందుకని ఈ వైసిపి ప్రభుత్వము సాగిస్తున్న ఈ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని, అలాగే మన హక్కులను చట్టాలను కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనాఉంది. అలాగే స్థానికంగా మన జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దిని గెలిపించి, మన జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనమందరం జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా అనేక మంది యువత జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులు అయ్యి జనసేన పార్టీ తీర్థం పచ్చుకున్నారు. అలాగే జనసేన పార్టీ పాడేరు మండల అద్యక్షులు నందోలి మురళికృష్ణ మాట్లాడుతూ ఈ గ్రామంలో చాలా మందికి పింఛన్లు తొలగించారు. 10 ఎకరాలు5 ఎకరాలు భూమి ఉందని కుంటి సాకులు చెప్తున్నారు.. అలాగే ఈ గిరిజన ప్రాంతాల్లో ఎన్ని ఎకరాలు భూమి వున్నా, గిరిజనులు చేస్తున్న సాగులో పంట పండే పరిస్థితి లేదు, పసుపు వేసిన 10 ఎకరాలు వున్న 365 రోజులు కు 30,000 వచ్చిన రోజు లేదు. అందుకని తక్షణమే అధికారులు స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.. అలాగే మీ సమస్యల కొసం బలంగా గళం వినిపిస్తాం అని తెలిపారు. అలాగే జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు సి.హెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు చైతన్యవంతులుగా తీర్చిదిద్ది, అలాగే యువతకి బంగారు భవిష్యత్తు రావాలని తెలిపారు.. అలాగే ఈ పర్యటనలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలుసుకున్నారు.. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడికి న్యాయం జరగటం లేదు. మంచినీటి సౌకర్యం లేదు, రోడ్డు సౌకర్యం లేక అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు అని గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నాం అని, అధికారులకు వినతి పత్రం సమర్పించారు. అయినప్పటికీ స్పందించని అధికారులు కరువయ్యారు.. అలాగే రేపటి తరానికి భవిష్యత్తు నేటి యువత యువతకు ఉద్యోగ అవకాశాలు లేక ఇంటికి, రైతు పనులకు పరిమితం అయ్యారు.
అలాగే అంగన్వాడీ కేంద్రాలు లేక పిల్లలకు విద్య కరువైంది. ఓట్ల కోసం మాత్రమే ప్రజల దగ్గరకు వచ్చిన అధికారులు వాళ్ల సమస్యలు నెరవేర్చడంలో ఎందుకనీ స్పందించడం లేదు. తక్షణమే బాధితుల న్యాయం జరిగే వరకు బలంగా పోరాటం చేయడానికి సిద్దంగా ఉన్నాం అని తెలిపారు. జనసేన పార్టీ నాయకులకు ఘన స్వాగతం పలికిన గ్రామస్తులకు దన్యవాదములు తెలిపారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తెలియజేసి మార్పుకి శ్రీకారం చుట్టి ఈ రాక్షస పాలనకి చరమ గీతం పాడాలని, ఈ రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని కొరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ ఎడ్వటైజర్ కిళ్లో రాజన్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి. మురళి కృష్ణ, కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు సి.హెచ్ అనిల్ కుమార్, బాలరాజు, సింగన్న, టీడీపీ మాజీ సర్పంచ్ మర్రి వెంకట్రావు, బింగు నాయుడు, బాసురావు, రమేష్, అప్పారావు, చంటి, సురేష్ బాబు, కిరణ్, కోటిబాబు, కృష్ణ, పేంక్షన్ తొలగించిన వృద్దులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.