సామాన్యులపై మున్సిపల్ సిబ్బంది దౌర్జన్యం

విజయవాడ వెస్ట్: 40వ డివిజన్ లో గత 40 సంవత్సరాలుగా స్థానికంగా నివసించే లక్ష్మీ షాపు తొలగించడం మున్సిపల్ సిబ్బందికి ఎంతవరకు న్యాయమని 40వ డివిజన్ జనసేన సమన్వయకర్త (సభ్యత్వాలు) మరియు చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం.హనుమాన్, 40 డివిజన్ జనసేన నాయకులు దాడిశెట్టి దుర్గారావు ప్రశ్నించారు. బుధవారం ఆయన్ విలేకరులతో ఎం.హనుమాన్ మాట్లాడుతూ 40 డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆంజనేయ రెడ్డి కట్టిన అక్రమ కట్టడాలకు ఎందుకు మున్సిపల్ కమిషనర్ తొలగించలేదు అప్పుడు మీ కళ్ళు మూసుకుపోయాయా? డివిజన్లో అనేక అక్రమ నిర్మాణాలకు అనేక కబ్జాలకి స్పందించని మున్సిపల్ కమిషనర్ రోజువారి జీవన ఉపాధి కోసం 40 సంవత్సరాలు నుంచి షాప్ తో తన జీవనాన్ని గడుపుతున్న లక్ష్మీ గారి షాప్ కూల్చడం మీకు న్యాయమా??.
స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ చేసే కబ్జాలు, అక్రమ నిర్మాణాలని మీరు ఎందుకు స్పందించరు??. అధికారం ఉందని మీరు ఏమి చేసినా చెల్లుబాటు అవుతుందా??. స్వప్నల్ దినకర్ సమాధానం చెప్పాలి. అక్రమ నిర్మాణంపై మీరు ఎందుకు స్పందించడం లేదు ??. అక్రమంగా షాపు కూల్చి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో వైసిపి కార్యాలయం కట్టాలనుకున్న మాట వాస్తవమా కాదా ?? తక్షణమే లక్ష్మి గారికి మీరు ధ్వంసం చేసిన షాపుని ఏర్పాటు చేయాలని, లేకపోతే తగిన రీతిలో మీపై చర్యలు తీసుకుంటామని
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం తరుపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మీ ప్రభుత్వానికి ఐదు నెలలు మాత్రమే
2024లో పోతిన మహేష్ గారు ఎమ్మెల్యే అయ్యాక మీ అరాచకాలు అక్రమాలు అవినీతిని బయటపెడతాం. అని ఎం. హనుమాన్ పేర్కొన్నారు.