శిథిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు – ప్రజల విశేష స్పందన

అనంతపురం నియోజకవర్గం: అనంతపురంలో జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో శిథిలమైన గుంతల రహదారికి మరమ్మత్తు చేయడం వలన నియోజకవర్గ నగర ప్రజల విశేష స్పందన వచ్చింది. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2, సోమవారము అనంతపురం అర్బన్ నియోజకవర్గం పరిధిలోని టవర్ క్లాక్ బ్రిడ్జ్ పక్కన కోర్ట్ రోడ్డుకు పోవు సర్వీస్ రోడ్డు. శిధిలమైపోయిన రహదారికి తెల్ల గరుసు వేసి గోతులను పూడ్చి చదును చేశారు. సంవత్సరాల తరబడి గుంతలు పడ్డ రోడ్లపై ప్రయాణం చేయలేక ఇబ్బంది పడుతున్నామని వాహనదారులు తెలియజేశారు. ఈ సమస్యపై స్పందించిన అనంతరం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి స్పందించి రహదారిని తన సొంత నిధులతో బాగు చేయడం పట్ల స్థానికులు, వాహనదారులు, వ్యాపారస్తులు.. జనసేన పార్టీకి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు శ్రమదాన కార్యక్రమం చేసి రోడ్డు మరమ్మత్తు చేసిన జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డికి అభినందనలు తెలిపారు.