అయోధ్య రామ మందిరం నిర్మాణానికి నరేష్ విరాళం

అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి అవసరమయ్యే విరాళాలను సేకరణను రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ట్రస్ట్‌కు పలువురు సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖులు తమ వంతు విరాళాలను అందిస్తూ వస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి పవన్ కళ్యాణ్‌, ప్రణీత, అక్షయ్ కుమార్ తమ వంతు విరాళాలు అందించగా, తాజాగా సీనియర్ నటుడు నరేష్ తన వంతు సాయంగా రూ. 5లక్షల విరాళాన్ని అందించాడు. ఈ విషయాన్ని నరేష్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. 90 కోట్ల మంది హిందువల కల నిజమవుతుంది. నా వంతుగా చిన్న సాయం చేశారు. ఈ బృహత్కర కార్యం కోసం మీరు కూడా మీ వంతు సాయం చేయండి అని నరేష్ పేర్కొన్నారు. ఒకప్పుడు హీరోగా పని చేసిన నరేష్ ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు.