ఒక కోటి 23 లక్షలు స్వాహా…

హైదరాబాద్ లో తాజాగా భారీ ఏటిఎం మోసం వెలుగులోకి వచ్చింది. ఆడిటింగ్ లో ఏటిఎం సిబ్బంది చేతి వాటం, వారు చేసిన నేరం గుట్టుగురట్టయింది. ఏటీఎం మెషిన్స్ లో డబ్బు నింపే సిబ్బంది సుమారు రూ. ఒక కోటి 23 లక్షలు స్వాహా చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం గురించి తెలుసుకున్న సికింద్రాబాద్ లోని సెక్యూర్ వాల్యూ ఇండియా ప్రైవేట్ సంస్థ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ను ఆశ్రయించింది.