గోమాతకు ప్రధమ చికిత్స చేయించిన గుడివాడ జనసైనికులు

  • ఆవు కాలు విరిగి రక్తస్రావంతో బాధపడుతున్న గోమాతకు ప్రధమ చికిత్స చేయించిన గుడివాడ పట్టణ జనసైనికులు

కృష్ణాజిల్లా, గుడివాడ పట్టణ స్థానిక ఏలూరు రోడ్ లో గుర్తు తెలియని వాహనం ఆవు కాలు మీద నుంచి వెళ్లడంతో కాలు విరిగి రక్తస్రావం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు గుడివాడ పట్టణ జనసైనికులు తెలియజేయగా వెంటనే స్పందించి పశువైద్య లను సంప్రదించి ప్రధమ చికిత్స చేయడంతో అక్కడ ఉన్న స్థానికులు ఆర్కే వారియర్స్ అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు డాక్టర్ మాచర్ల రామకృష్ణ మాట్లాడుతూ గోమాతలను ఎంతో పవిత్రంగా పూజించే భారత దేశంలో గుడివాడ పట్టణంలో ఇలాంటివి జరగడం చాలా దౌర్భాగ్యం అని దయచేసి గో యజమానులు రోడ్లమీదకు ఆవులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులకు మరియు గుడివాడ పట్టణ పోలీస్ వారికి ఎన్నోసార్లు విన్నవించుకుంటున్న పట్టించుకునే నాధుడే లేరని వాపోయారు దయచేసి ప్రభుత్వాధికారులు గో యజమాలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు రోడ్లు మీద ఈ ఆవులు రావడం వల్ల వాహనదారులకు మరియు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం మరియు ప్రమాదం కూడా అని తెలియజేశారు. నోరులేని మూగజీవాలను కాపాడాలని మళ్లీ ఇలాంటివి పునరత్వం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. మేము అడిగిన వెంటనే వైద్యం అందించిన పశు వైద్య అధికారులకు మా హృదయపూర్వక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నూనె అయ్యప్ప, కిరణ్ శివ చరణ్ తేజ్ మరియు జనసేన పాల్గొన్నారు.