చంద్రబాబు విడుదలను కోరుతూ ప్రత్యేక పూజలు

పి.గన్నవరం: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ వారిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ మామిడికుదురు మండలం లూటుకుర్రు గ్రామంలో గల భక్తాంజనేయ స్వామి ఆలయంలో పంచామృత అభిషేకములు చేయించిన జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి కుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాత కాపు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి బోనం బాబు, మామిడికుదురు మండల బీసీ సెల్ అధ్యక్షులు కడలి నూకరాజు, జనసేన, టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.