సామాజిక బాధ్యతతో దేశ శ్రేయస్సు కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి

  • అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్: పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ సేవాస్పూర్తితో మెగా సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ జన్మదిన వారోత్సవాల్లో భాగంగా సాయి ధరంతేజ్ బ్లడ్ డోనర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాయి ధరంతేజ్ యువత అధ్యక్షుడు పవర్ శేఖర్, పట్టణాధ్యక్షుడు పామయ్య అధ్యక్షతన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ముఖ్యఅతిథిగా గుంతకల్ పట్టణం స్థానిక హౌసింగ్ బోర్డు వివేకానంద పార్క్ నందు హెచ్ఐవి బాధిత చిన్నపిల్లలకు మరియు ప్రగతి మైత్రి మహిళా సంఘం కార్యాలయం నందు హెచ్ఐవి బాధిత పెద్దలకు న్యూట్రిషన్ ఫుడ్ పంపిణీ” కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రజలకు చేసిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని వారి వారి అభిమానులు సమాజం నాకేమిచ్చింది అని కాకుండా సమాజానికి మనం ఏం చేయగలం అనే ఆలోచనతో నిత్యం ముందుకు వెళుతూ ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శప్రాయాలుగా నిలిచారని, వీరిలా నిత్యం ఇతరులకు సహాయ పడడం అలవాటుగా మార్చుకోవాలని దేశభక్తితో, సామాజిక బాధ్యతతో, క్రమశిక్షణతో మన దేశ ప్రగతి కోసం, శ్రేయస్సు కోసం అందరం కలిసికట్టుగా సేవా భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు బండి శేఖర్, కురువ పురుషోత్తం చిరంజీవి యువత అధ్యక్షులు పాండు కుమార్, కొనకొండ్ల శివ, ఆటో రామకృష్ణ, రామకృష్ణ, ఆటో కృష్ణ, మంజునాథ్, అమర్నాథ్, బర్మశాల శేఖర్, శివకుమార్, ఆటో బాషా, మతం వీరేష్, కసాపురం మారుతి, ఆటో రామంజి, సూర్యనారాయణ, అనిల్ కుమార్, అల్లు రవి, హరీష్ రాయల్, కసాపురం వంశీ, సింహాద్రి మరియు ప్రగతి మైత్రి మహిళా సంఘం సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.