మాటల ఎమ్మెల్యే కోవూరు ప్రసన్న అభివృద్ధి చేతలకు పనికి రావడం లేదు

కోవూరు: ప్రసన్న గారి తండ్రి శ్రీనివాసులు రెడ్డి గారు ఎంతో మర్యాదస్తులు, ప్రజలకు ఎంతో మేలు చేశారు. వారి సోదరులు కూడా మృదు స్వభావి, కానీ ప్రసన్న పిచ్చి మాటలు మాట్లాడుతూ వయసైపోయు ఓపిక లేక ప్రజలు ప్రతిపక్షాలపై విరిచుకు పడుతూ పిచ్చి వానిలా ప్రవర్తిస్తుంటారు.. అంటూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుగుల కిషోర్ ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డి పాళెం ఖాజా నగర్ లోని గుడిపల్లి కాలవ వద్ద పారుదల లేక దుర్గంధభరితంగా నిలిచిపోయి పట్టణం నడిబొడ్డున వ్యాధులకు కారణమవుతున్న కాలువ గురించి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2021వ సంవత్సరంలో అప్పటి జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోటి రూపాయలు గుడిపల్లి కాలవను అభివృద్ధి చేస్తామని సాంక్షన్ చేయించుకున్న కోటి రూపాయలు ఏమైందో తెలియదు. మరొకసారి 2నెలలు ముందు సమావేశం పెట్టి గుడిపల్లి కాలంలో అభివృద్ధి పరుస్తానంటూ చెప్పి నిలిపివేశారు. మాటలు చెప్పే కొవ్వూరు ఎమ్మెల్యే చేతలకు పనికిరాకుండా పోయారు. ఏ సమస్య గురించి ప్రశ్నించినా జవాబు ఉండదు. ఇసుక, గ్రావెల్ అక్రమంగా దోచుకు తింటున్నారు. ప్రసన్న గారి నాన్నగారు శ్రీనివాసులు రెడ్డి గారు ఎంతో మర్యాదగా ఉండేవారు ప్రజలకు ఎంతో మేలు చేశారు. వారి సోదరులు కూడా సత్ప్రవర్తన కలిగి ఉంటాడు ప్రసన్న గారు మాత్రం ప్రతిపక్షాలపై నోటికి వచ్చినట్లు అడెంగిలిఞమాటలు మాట్లాడుతూనే ఉంటారు.
20వ తేదీ నుంచి ఏదో యాత్ర స్టార్ట్ చేయమని మొత్తం రాష్ట్ర రాష్ట్రంలో ఎమ్మెల్యేలకి జగన్ గారి పిలుపునిచ్చారు. మీ యాత్రను లగ్జరీ కార్ లో కాకుండా ఆటోలో సందర్శించండి. గ్రామాల్లో కనెక్టివిటీ రోడ్లు అతి దారుణంగా ఉన్నాయి. ఏం అభివృద్ధి సాధించాలని ప్రజలను మీరు పలకరించగలరు అనుకుంటున్నారు. కోవూరు నియోజకవర్గంలో మేజర్ ఓట్లు కలిగి ఉన్న బుచ్చిరెడ్డిపాలెం లో కనీస వసతులు కల్పించకుండా పెత్తందారులు సొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం కి అవసరమైన సౌకర్యాలు మెండుగా జరుపుకుంటున్నారు. అనేక వైపల్యాలు ముందు పెట్టుకుని ప్రతిపక్షాలపై విరుచుకు పడే మీకు మతిస్థిమితం లేదనుకుంటున్నారు. మా మాట తీసుకొని కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయనందుకు సంతోషిస్తున్నాం… కానీ ఎవరు పోటీ చేస్తున్నారని ఫోటో కనిపించడం లేదని ప్రజల అయోమయంలో ఉన్నారు. దశాబ్దాలుగా మీరే పాలిస్తూ కోవూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధికి దూరంగా ఉంచారు. ఇక ఐదు నెలలే మీకు సమయం ఉంది రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మీకు సరైన గుణపాఠం చెప్తారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం ఏదైనా కానీ జనసైనికులు వారి వెంటే ఉన్నారు ప్రజలు కూడా ఒకసారి మద్దతు తెలిపి ప్రజా ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఉపాధ్యక్షుడు సుదీర్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, షాజహాన్, సాయి, శ్రీను, వర తదితరులు పాల్గొన్నారు.