కొల్లాపూర్ నియోజకవర్గంలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

తెలంగాణ, కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో పెంట్లవెల్లి రోడ్డు గవర్నమెంట్ కాలేజ్ ఎదురుగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆదివారం జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ భైరపోగు సాంబశివుడు ఘనంగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీనీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం రాజ్యాధికారానికి దూరంగా ఉన్న వర్గాలకు రాజ్యాధికారాన్ని దగ్గర చేయడమే లక్ష్యంగా పార్టీని ప్రారంభించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు మరింతగా కొల్లాపూర్ నియోజక వర్గంలో ప్రజల పక్షాన పోరాడేందుకు ముందుకు వచ్చిన జనసేన పార్టీని ఆ పార్టీ కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం ఎంతో సంతోషమని జనసేన పార్టీ కొల్లాపూర్ నియోజకవర్గంలో బలమైన పార్టీగా భవిష్యత్తులో అవతరించబోతుంది యువత పేద వర్గాల ప్రజల ఆకాంక్షల మేరకు వారి యొక్క భవిష్యత్తు కోసం పుట్టిన పార్టీ జనసేన పార్టీ అన్నీ తెలపడం జరిగింది. అలాగే జనసేన పార్టీని మరింతగా ప్రజలకు చేరువ చేసేందుకు ముందుకొచ్చి మేము కూడా కొల్లాపూర్ నియోజక వర్గ పరిధిలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్తామని ముందుకు వచ్చి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఇన్సూరెన్స్ పాలసీని ఆ కిట్ల పంపిణీ పార్టీ ప్రారంభోత్సవం సందర్భంగా క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీ చేయడం జరిగింది. కిట్ల పంపిణీ అనంతరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ శ్రీ భైరపోగు సాంబశివుడు మాట్లాడుతూ కార్యకర్తలకు కోసం నిరంతరం ఆలోచిస్తూ పరితపిస్తూ వారికి ప్రమాదవశాత్తు మైన జరిగితే పార్టీ నుంచి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫునుంచి ఏదో కొంత భరోసాగా వారి కుటుంబాలకి ఉండాలని జనసేన పార్టీ ఇన్సూరెన్స్ పాలసీని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకురావడం జరిగింది. దీని ప్రతి కార్యకర్తకి తీసుకునే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు తీసుకెళ్లి భవిష్యత్తులో మరింతగా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం భారీగా అయ్యే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆయన తెలపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వనపర్తి నియోజకవర్గం కో-ఆర్డినేటర్ ముకుంద నాయుడు, వనపర్తి జిల్లా ముఖ్య నాయకులు బాలకృష్ణ, ఉత్తేజ్, సురేష్, కోడేరు మండల అధ్యక్షుడు పోలోజుల రఘు, ఉపాధ్యక్షుడు నారాయణ, కొల్లాపూర్ మండల నాయకులు తలారి మల్లేష్, బత్తిని బాలు, వీపనగండ్ల మండల నాయకులు బాలకృష్ణ, పెద్దకొత్తపల్లి మండల నాయకులు మల్లేష్, పెంట్లవెల్లి మండల నాయకులు రవితేజ, కొల్లాపూర్ లోకల్ నాయకులు ఫారుక్, రాఘవేంద్ర, మల్లేష్, రమేష్, పానగల్ మండల నాయకులు భరత్, వివిధ మండలాలకు సంబంధించిన జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.