స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోనే జనసేన పార్టీ ఆవిర్భావం

♦️ అస్థిర ఆంధ్రాను సుస్థిర స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడం ఒక పవన్ కళ్యాణ్ తోనే సాధ్యం
♦️ గుత్తి మండలం, చెర్లోపల్లి గ్రామం జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో
♦️ అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ

గుంతకల్ నియోజకవర్గం, గుత్తి మండలం, చెర్లోపల్లి గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు, నిస్వార్థ జనసైనికుల సహకారంతో గుత్తి మండల నాయకులు పోతురాజుల చిన్న వెంకటేశులు, పాటిల్ సురేష్, నాగయ్య రాయల్ అధ్యక్షతన అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం గ్రామ ప్రజల అండదండలతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వాసగిరి మణికంఠ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేయడానికి, అంబేద్కర్ అందించిన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడడానికి ముఖ్యంగా అన్నం పెట్టే రైతన్న కన్నీటిని తుడవడానికి, నవసమాజ నిర్మాణ సాధనకై అనునిత్యం జనసేన పార్టీ కట్టుబడి ఉంటుందని, రాబోయే రోజుల్లో ఒక నియంత పాలనకు చమరగీతం పాడేందుకు తన అద్భుతమై పోరాట పటిమతో అస్థిర పాలనలో కొనసాగుతున్న రాష్ట్రాన్ని సుస్థిర స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ద గల వ్యక్తి జనసేనాని అని, గడిచిన నాలుగున్నర ఏళ్ల వైసిపి పాలనలో తిరోగమనంలో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి పురోగమించేలా చేసే బాధ్యతను జనసేన తీసుకుంటుంది అని కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో బలంగా ప్రజలందరి అండదండలతో వైసిపి పార్టీ నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు జనసేన పార్టీ పోరాటం చేస్తుంది. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాలు, ఆకృత్యాలు, దాడులు, అక్రమ కేసుల విముక్తికై ప్రజలకి భరోసా కల్పిస్తూ నిత్యం ప్రజా పోరాటాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ ను రానున్న ఎలక్షన్ లో ప్రజలందరూ ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఇంతటి చారిత్రాత్మక మొట్టమొదటి గుత్తి మండల జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించిన చెర్లోపల్లి జనసైనికులకు, గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెర్లోపల్లి గ్రామ జనసైనికులు నాగేంద్ర, మనోజ్ కుమార్, రంగస్వామి, రామకృష్ణ, హరికృష్ణ, రాంబాబు, శ్రీరాములు, రమేష్, సాయి, దుర్గ, తిక్క స్వామి, సుభాష్ జయకృష్ణ, శివకృష్ణ, వంశీ, దినేష్, రంగస్వామి, వేణు, మోహన్, రవి, మల్లికార్జున, శంకరయ్య, సిద్ధార్థ, శీనా, అజయ్ సీనియర్ నాయకులు గాజుల రాఘవేంద్ర, గుంతకల్ చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, కప్పట్రాల కోటేశ్వరరావు, సుబ్బయ్య, కసాపురం వంశీ పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.