జనసేన క్రియాశీలక సభ్యునికి ప్రమాద భీమా చెక్ అందజేసిన జనసేన నాయకులు

ఇచ్చాపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం నిరంతరం కష్టపడుతున్న జనసైనికులకు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు వారి కుటుంబాలను ఆదుకునేందుకు చేపట్టిన మహోన్నత కార్యక్రమం క్రియాశీలక సభ్యత్వం. ఇందులో భాగంగా కవిటి మండలం, లండారి పుట్టుగ గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు నర్తు జోగారావు కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురై అతనికి గాయాలయ్యాయి. జోగారావు క్రియాశీలక సభ్యత్వం కలిగి ఉన్నందున శనివారం మొట్టమొదటిసారిగా ఇచ్ఛాపురం విచ్చేసిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పిసిని చంద్రమోహన్ చేతుల మీదుగా ఇచ్ఛాపురం జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు మరియు జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ బైపల్లి ఈశ్వర్ రావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా సమక్షంలో 50 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. జనసేన పార్టీ కార్యదర్శి పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ నీతి నిజాయతీ కలిగిన నాయకుడు, రాజకీయ వ్యవస్థలో నూతన మార్పులు తీసుకువచ్చి భావితరాల భవిష్యత్ మార్గదర్శి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అని, వ్యవస్థలను, రాజకీయాలను భ్రష్టు పట్టించిన వైసీపీకి చరమగీతం పాడాలంటే జనసేన-టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చాపురం జనసేన ఇంచార్జ్ శ్రీ దాసరి రాజు గారు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆంధ్ర రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది అని, ఇచ్చాపురం నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని, కిడ్నీ సమస్యలు పూర్తిగా నివారణ చేశామని వైసీపీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నారని, వాస్తవానికి ఒక్క శాతం కూడా వారు చెప్పింది జరగలేదని, కిడ్నీ రోగులు పడుతున్న ఇబ్బందులు ఆ నాయకులకు తెలియవని నాతో పాటు వస్తే కిడ్నీ బాధితులు ఎంతమంది ఉన్నారో చూపిస్తా అని ఎద్దేవా చేశారు. మొదటిసారిగా ఇచ్ఛాపురం విచ్చేసిన శ్రీ చంద్రమోహన్ గారికి జనసేన నాయకులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎచ్చెర్ల జెడ్పీటీసీ అభ్యర్థి భూపతి అర్జున్ రాజు, కంచిలి మండల అధ్యక్షులు శ్రీ డొక్కరి ఈశ్వరరావు, జి. సిగడాం మండల అధ్యక్షులు, సర్పంచ్ మీసాల రవి కుమార్, యువ నాయకుడు టి.పైడి రాజు, వీరమహిళలు శైలజ, సరస్వతి, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, ఇచ్ఛాపురం ఐటీ విభాగం కోఆర్డినేటర్ కాళ్ళ దాలయ్య, మున్సిపాలిటీ వార్డు ఇంచార్జ్ రోకళ్ళ భాస్కర్, కుసుంపురం సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్ లతో పాటు ఎంపీటీసీ అభ్యర్దులు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.