టీం జనసేన వై కోట ఆధ్వర్యంలో విజయవంతంగా జనసేన-జనసేవా కార్యక్రమం

టీం జనసేన వై కోట నాయకుల ఆధ్వర్యంలో గురువారం జనసేన-జనసేవ కార్యక్రమంలో భాగంగా వైకోట గ్రామపంచాయతీలోని ముస్లిం వీధిలో వికలాంగుడైన “షేక్ ఖాదర్ భాషా” కి రెండు నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులతో పాటు కూరగాయలు బియ్యం పంపిణీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా యువ నాయకులు మాట్లాడుతూ మా పంచాయతీలో మాత్రమే కాకుండా మండల పరిధిలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా.. ఎక్కడ ఆకలి ఉన్నా.. ఎక్కడ మా అవసరం ఉన్నా.. వారికి అండగా నిలబడతామని మా స్థాయిలో ప్రయత్నించి వారి సమస్యను పరిష్కరిస్తామని తెలియచేసారు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు అవకాశం కల్పించిన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు రెడ్డి మనీ, కిషోర్, మనోజ్, గణేష్, శివ, సుమన్, హరి, రమణ, భాస్కర్ బాలు పాల్గొన్నారు.