గొలకోటి వెంకటేశ్వరరావు సంస్మరణ సభలో పాల్గొన్న కందుల, పితాని

ముమ్మిడివరం నియోజకవర్గం: జనసేన పార్టీ ముమ్మిడివరం మండల అధ్యక్షులు గొలకోటి వెంకటేశ్వరరావు (వెంకన్న) సంస్మరణ సభ మరియు పెద్దకార్యంలో కందుల దుర్గేష్ మరియు పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. ముమ్మిడివరం మండలం, సి.హెచ్ గున్నేపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన గొలకోటి వెంకటేశ్వరరావు (వెంకన్న) సంస్మరణ సభ గొలకోటి దొరబాబు అధ్యక్షతన జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ పాల్గొన్నారు. మరొక అతిథిగా అమలాపురం జనసేన నాయకులు డి ఎం ఆర్ శేఖర్ పాల్గొన్నారు. గొలకోటి వెంకటేశ్వరరావు(వెంకన్న) చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఆయన మరణం పార్టీకి చాలా తీరని లోటు అని, పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పాల్గొనే వారిని, అటువంటి వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమని, పార్టీ కార్యక్రమాలను ముందుండి నడిపించే వారని, వారాహి యాత్ర విజయవంతంలోనూ, ఓటింగ్ నమోదు ప్రక్రియ కార్యక్రమంలోనూ చాలా కీలక పాత్ర పోసించారాని పితాని కన్నీటిపర్యంతం అయ్యారు.
వీరి వెంట జనసేన నాయకులు ఆర్.డి.ఎస్ ప్రసాద్, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ జకంశెట్టి బాలకృష్ణ (పండు), ఉభయగోదావరి జిల్లా మహిళా కోఆర్డినేటర్ ముత్యాల జయలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, జనసేన సీనియర్ నాయకులు గోదాశి పుండరీష్, ముమ్మిడివరం నగర పంచాయతీ అధ్యక్షులు కడలి వెంకటేశ్వర (కొండ), కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, రంబాల రమేష్, లంకెలపెల్లి జమ్మిమొదలగు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.