పెన్షన్లు నేరుగా ఇంటికి వచ్చి ఇచ్చే వాలంటీర్లు నడకుదురులో కనబడరే?

  • జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కరప మండలం, నడకుదురు గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి పిల్లి అనంతలక్ష్మిసత్యనారాయణ మూర్తి నాలుగవ రోజు ఇంటింటికి పర్యటన చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులనుండి వేశేష స్పందన వచ్చింది. ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరిస్తూ, వాలంటీర్లను అర్హులైన వికలాంగులకు పెన్షన్ అడిగితే రేపు మాపు అని సాకులు చెబుతున్నారని, గట్టిగా అడిగితే ఎవరన్నా చనిపోతే ఇస్తామని అన్నారని వాపోతున్నారు! మురుగు నీటి సమస్యలు, కలుషితం అయిన మంచినీరు వల్ల ఆరోగ్య సమస్యలతో సతమతమవున్నామని మొరపెట్టుకున్నారు. అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ కుమారి, పార్టీ నాయకులు, మండలి ప్రెసిడెంట్ బండారు మురలి, మండలి ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, నడకుదురు గ్రామ కమిటి ప్రెసిడెంట్ భాస్కర్, గ్రామ వైస్ ప్రెసిడెంట్ మణికంఠ స్వామి, సోషల్ మీడియా శేఖర్, శివ, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎంపీపీ గుల్లిపల్లి శ్రీనివాస్ గ్రామ పార్టీ అధ్యక్షులు చీపురుపల్లి జయేంద్ర బాబు, మాజీ జడ్పీటీసీలు బుంగా సింహాద్రి, మట్టా ప్రకాష్ గౌడ్, క్లస్టర్ ఇన్చార్జిలు సరిదే నాగ హరినాథ్, మిరపల సూర్య ప్రకాష్ నాయకులు, పోతల గోవిందు, ఎస్వీ రామకృష్ణ, సత్యవరపు సత్యం, యాసలపు కన్నబాబు, పంపన కన్నారావు, గొర్రిపూడి ఎంపీటీసీ యనమదల వెంకటలక్ష్మీ దొరబాబు, ఎలగా లోవరాజు, గొల్లపల్లి బుజ్జి, దెయ్యాల త్రిమూర్తులు, ఓలేటి సూర్యనారాయణ, బొజ్జ భవాని సాంబశివరావు, పలివెల గాయత్రి, గుత్తుల లక్ష్మీ, దొమ్మేటి వెంకటరమణ, పెమ్మాడి శ్రీను, గంజా రాంబాబు, వై సుకుమార్ జనసేన నాయకులు బిరుదా భాస్కర తంబయ్య, సింగంపల్లి నాగేశ్వరరావు, స్వామి, గొల్లపల్లి చంద్రశేఖర్, అబ్బిరెడ్డి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.