కాకినాడ సిటిలో ప్రజాచైతన్య కార్యక్రమం

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో సూర్యనారాయణపురంలోని క్రిష్ణుడు గుడి ప్రాంతం వద్ద జనసేన పార్టీ శ్రేణులు ప్రజాచైతన్య కార్యక్రమం రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగినది. ఈ సందర్భంగా జనసేన శ్రేణులు స్థానిక ప్రజలకు ఇటీవల చెప్పిన గేదెల కొనుగోలులో అవినీతిపై స్థానిక ప్రజలకి వివరిస్తూ చైతన్యపరిచారు. ఒకపక్క రాష్ట్రంలో ఎప్పటినుండో ఉన్న స్థానిక మరియు సహకార డైరీలని నాశనం చేసేలా అమూల్ డైరీకి రెడ్ కార్పెట్ పరిచి వారికి కావాలిసిన అక్కర్లేని తాయిలాలన్నీ ఇచ్చి ప్రోత్సహించారనీ, దీనికి తోడు రాష్ట్రంలో పాల వెల్లువ సృష్టిస్తామని చెప్పి మినీ డైరీలు అంటూ గేదెలను కొన్నామంటూ లేని గేదలని కొనేసి నిధులు మాయం చేసారన్నారు. ఈతతంగంపై సి.బి.ఐ విచారణ చేస్తే నిజాలు నిగ్గుతేలుతాయన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనీ, దీనిపై ప్రజలు జాగ్రత్త వహించాలనీ అందుకే తమ పార్టీ ప్రజా చైతన్య యాత్రని నిర్వహిస్తోందని స్థానికులకి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అట్ల సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కృష్ణ సిటీ ఉపాధ్యక్షులు అడబాల సత్యనారాయణ జనసేన నాయకులు ముత్యాల దుర్గాప్రసాద్, శ్రీమన్నారాయణ, సుంకర సురేష్, అజయ్ యాదవ్, దారపు సతీష్, మావులూరు సురేష్, సమీర్, పోలిశెట్టి రామారావు, సతీష్ కుమార్ మిరియాల హేమావతి తదితరులు పాల్గొన్నారు.