థ్రిల్లింగ్ గా ఉంది.. ట్విటర్ లో మెగాస్టార్
భారత సినీ పరిశ్రమలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్ శంకర్‌తో సినిమా అంటే అంచనాలు ఓ రేంజ్లో ఉంటాయి. అలాంటి డైరెక్టర్ తో రాంచరణ్ మూవీ చేస్తున్నట్టు ప్రకటించడంతో మెగా అభిమానులు సంతోషంలో ఎగిరిగంతేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే సూపర్ థ్రిల్లింగ్‌గా ఫీలవుతున్నారు. ఎందుకంటే తనకు శంకర్‌తో సినిమా చేయాలని ఉందని గతంలో చెప్పారు చిరు. కానీ ఇపుడు తన కుమారుడు రాంచరణ్ శంకర్ తో సినిమా చేస్తుండటంతో..తన ఎక్జయిట్‌మెంట్‌ను ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు చిరంజీవి.
క్రాఫ్ట్, విజనరీ, సరిహద్దులను దాటడంలో మార్గదర్శకుడు శంకర్‌తో రాంచరణ్ సినిమా చేస్తుండటం థ్రిల్ కలిగించే విషయం. నీ వరుస సినిమాలు భారత ఖ్యాతిని పెంచే దర్శకులతో చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. గుడ్‌లక్..అంటూ #RC15 #SVC50 హ్యాష్‌ట్యాగ్‌లను జోడించారు చిరు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించబోతున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత రాంచరణ్-శంకర్ కాంబినేషన్ సెట్స్ పైకి రానుంది.
Thrilled about @AlwaysRamCharan joining hands with @shankarshanmugh master of the craft,visionary & a pioneer in transcending boundaries.Happy that your consecutive films are with passionate directors who strive to raise the bar for #IndianCinema. Good Luck! #RC15 #SVC50 https://t.co/8yCUbys54q
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 12, 2021