కాకినాడ సిటి జనసేన ఆధ్వర్యంలో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు ముమ్మిడివారి వీధి ప్రాంతంలో శ్రీమన్నారాయణ & మావులూరి సురేష్ ల ఆధ్వర్యంలోను 33వ డివిజన్ 2 టవున్ పోలీసు స్టేషన్ వెనుక ప్రాంతం దగ్గర దారపు సతీష్ & మహమ్మద్ సమీర్ల అధ్వర్యంలో దివ్యాంగుల భరోసా యాత్ర నిర్వహించడం జరిగింది. ఈ యాత్రలో భాగంగా జనసేన పార్టీ శ్రేణులు దివ్యాంగుడు నాగబాబు, రాంబాబు మరియు షేక్ బడాలను కలిసి వారి బాగోగులని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాగులకు కేటాయించిన ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఈ వై.సి.పి ప్రభుత్వం జాప్యం చేస్తూ దివ్యాంగుల జీవితాలతో ఆడుకోడం చూస్తుంటే ఈ ముఖ్యమంత్రికి బొత్తిగా మానవత్వమే లేదనిపిస్తొందని అన్నారు. అసలు దివ్యాంగుల సంక్షేమ శాఖ ఏమేమి కార్యక్రమాలు అమలు చేస్తోందో వైనమే తెలియడంలేదనీ, ఈ ప్రభుత్వం నొరు విప్పితే నవరత్నాలు నవగ్రహాలే తమకి ముఖ్యమనీ ఇంకేవీ లెక్కలేదన్నట్టు ప్రవర్తిస్తోందనీ పాలించడం అంటే ఒక్క నవరత్న పధకాలు మాత్రమే కాదని ఈ వై.సి.పి ప్రభుత్వం తెలుసుకోవాలన్నారు. ఈ వై.సి.పి ప్రభుత్వ నిర్లక్ష్య మరియు నిరంకుశ పాలనని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.