గడపగడపకు జనసేన ప్రచారంలో ముయ్యబోయిన ఉమాదేవి

తెలంగాణ, అశ్వరావుపేట దొంతికుంటలో బిజేపి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి బుధవారం గడపగడపకు ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రచారంలో భాగంగా అందరికి అభివాదం చేస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

  • ముయ్యబోయిన ఉమాదేవి సమక్షంలో జనసేనలో చేరిన చిట్టి శ్రవణ్ కుమార్ శర్మ

అశ్వారావుపేటకు చెందిన ప్రముఖ అర్చకులు చిట్టి శ్రవణ్ కుమార్ శర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి, ఆయన ఆశయ సాధనకు ఒక సైనికుడిగా పనిచేస్తానని. అశ్వారావుపేట బిజేపి బలపరచిన జనసేన పార్టీ అభ్యర్థి ముయ్యబోయిన ఉమాదేవి, అశ్వారావుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ డేగల రామచంద్రరావు అసెంబ్లీ అభ్యర్థి ఉమాదేవి సమక్షంలో బుధవారం జనసేన పార్టీలో చేరారు.