మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

మహారాష్ట్ర లో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జల్గావ్ జిల్లాలో జరిగిన ట్రక్కు ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. అయితే బాధితులు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.