అధికారులు మేల్కొని ప్రజాస్వామాన్ని కాపాడాలి: దేవర మనోహర్

తిరుపతి: చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించడం జరిగింది. చంద్రగిరి నియోజకవర్గంలో 2019లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 30 వేల దొంగ ఓట్లు వేయించుకుని 2019లో ఎమ్మెల్యేగా గెలిచాడు దొడ్డిదారిలో, కానీ మరలా 2024లో అలాగే చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని చంద్రగిరి జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర్ మరియు చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పులివర్తి నాని ఆర్డీవో, కలెక్టర్ లకు వినతి పత్రాలు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయింది. ఈ విషయాన్ని అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇక మూడు నెలల ముచ్చటగా ఈ జగ్గారెడ్డి గవర్నమెంట్ కూలబోతుంది. కనుక ఇప్పటికైనా అధికారులు మేల్కొని ప్రభుత్వ అధికారులుగా పని చేయాలని మరియు ప్రజాస్వామాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమానికి చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దేవర మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి సుభాషిని ఆకేపాటి, జనసేన పార్టీ నాయకుడు మరియు కాపు సంక్షేమనసేన రైతు విభాగం తిరుపతి జిల్లా అధ్యక్షులు రమేష్ బాబు మారసాని, పగడాల యువరాజు పాల్గొన్నారు.