అత్యధిక మెజారిటీతో గెలవడమే జనసేన టిడిపి లక్ష్యం

  • ఒక మనిషి ఒక విలువ అదే ఒక ఓటు
  • బూతు లెవల్ ఏజెంట్ లకు శిక్షణా కార్యక్రమం
  • ప్రజలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులను స్వాగతిస్తున్నారు
  • అత్యధిక మెజారిటీతో గెలవడమే జనసేన టిడిపి లక్ష్యం
  • జనసేన ఇంచార్జి డా. యుగంధర్ పొన్న

గంగాధర నెల్లూరు నియోజకవర్గం: కార్వేటి నగరం మండలంలోని బూత్ లెవల్ ఏజెంట్లకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పుత్తూరు కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జి డాక్టర్ యుగంధర్ పొన్న మాట్లాడుతూ ఓటర్లను పోలింగ్ బూతులు వరకు వెళ్లి, ఓటు వేసే వరకు ఎలా సన్నద్ధం చెయ్యాలని వివరించారు. దొంగ ఓట్లను ఎలా అరికట్టాలి, పోలింగ్ బూత్లలో ఏ విధంగా ప్రవర్తించాలి, వైసిపి దౌర్జన్యాలను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఉదయం పూట మాక్ పోలింగ్ ఎలా నిర్వహిస్తారు. పోలింగ్ అయిన వెంటనే బ్యాలెట్ బాక్సులను ఎలా తరలిస్తారు అనే అంశాలకు సంబంధించి బూత్ కమిటీ ఏజెంట్లకు క్షుణ్ణంగా వివరించారు. ఒక మనిషి ఒక విలువ అదే ఒక ఓటు దానిని సక్రమ పద్ధతిలో వినియోగించాలని ఓటర్లను కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులను స్వాగతిస్తున్నారని, ఇద్దరు ప్రభుత్వం కోసం ప్రజలు పరితపిస్తున్నారని, జనరంజక పాలన అందించటం ఖాయమని తెలిపారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఈసారి జరిగే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవడమే జనసేన టిడిపి లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు, మండల బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి, నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, పాలసముద్రం మండల అధ్యక్షులు లతీష్, నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్సులు వెంకటేష్, లోకేష్, యువజన కార్యదర్శి అన్నామలై, నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ చంద్రమౌళి, జిల్లా కార్యక్రమం కమిటీ సభ్యులు భానుచంద్రారెడ్డి, కార్వేటి నగర్ మండల ప్రధాన కార్యదర్శులు దేవేంద్ర, హరీష్, మండల ఉపాధ్యక్షులు భాస్కర్ రెడ్డి, మండల కార్యదర్శి మోహన్, కొట్టారువేడు పంచాయితీ అధ్యక్షులు వినోద్, టౌన్ కమిటీ ప్రధాన కార్యదర్శి మహేంద్ర, జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఉదయ్, రవి, కార్వేటి నగర్ మండల కార్యదర్శి మురళి, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు ముని రత్నం శెట్టి, జనసేన పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లు పాల్గొన్నారు.