నాదెండ్ల అరెస్టును ఖండించిన చిన్న రాయల్

పుంగనూరు, జనసేన పార్టీ రాజకీయాల వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అక్రమ అరెస్టును పుంగనూరు నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు సిరివెలు గంగాధర్(చిన్న రాయల్) ఖండించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ టైకూన్ కూడలి సమస్యపై నిరసన తెలుపుటకు నాదెండ్ల మనోహర్ బయలుదేరగా పోలీసులు అడ్డుకోవడం అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు మని ఎస్సీ సెల్ నియోజవర్గ అధ్యక్షులు చంద్రబాబు ఎన్నారై శివప్రసాద్ పాల్గొన్నారు.