నాదెండ్ల మనోహర్ అరెస్టు అప్రజాస్వామికం – బొంతు రాజేశ్వరరావు

రాజోలు, విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ని విశాఖ నోవాటెల్ హోటల్ దగ్గర అడ్డుకుని పోలీసులు అరెస్టు చెయ్యడాన్ని రాజోలు జనసేన పార్టీ నాయకులు రాజేశ్వరరావు బొంతు తీవ్రంగా ఖండించడం జరిగింది.