నాదెండ్ల అరెస్టు అప్రజాస్వామ్యం: చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మీడియా ముఖంగా మాట్లాడుతూ జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమని ప్రజల కోసం విశాఖ టైకూన్ జంక్షన్ తెరవాలని కోరితే అరెస్ట్ చేయడం హేయమైన చర్యని ఇలాంటి ఎన్ని అక్రమ అరెస్టులు చేసిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ భయపడరని అలాగే ధర్మవరంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నా మీద పెట్టిన అక్రమ కేసును తీవ్రంగా ఖండిస్తున్ననని నా మీద నా భార్య మీద నా కుటుంబం మీద ఏన్ని అక్రమ కేసులు పెట్టిన దీటుగా ఎదుర్కొంటాం భయపడే ప్రసక్తే లేదు మాకు ధర్మవరం ప్రజలు అండగా ఉన్నారని 2024 లో జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ కేసులపై న్యాయ విచారణ జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.