మహారాష్ట్రలో మళ్ళీ లాక్ డౌన్…!!

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వాలు కరోనాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనాపై మళ్ళీ దృష్టి సారించింది. ముంబైలో కేసులు పెరుగుతుండటంతో నిబంధనలకు కఠినంగా అమలు చేస్తున్నది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. ఒకవేళ మాస్క్ ధరించకుండా బయటకు వస్తే రూ.200 ఫైన్ వేస్తున్నారు. నిబంధనలు కఠినం చేయడంతో పాటుగా జరిమానాలు విధిస్తుండటంతో మాస్క్ పెట్టుకోవాల్సి వస్తున్నది. ఇక ఇదిలా ఉంటె, అటు అమరావతి, యావత్మల్ జిల్లాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రెండు జిల్లాల్లో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. వారాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. శనివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్ డౌన్ విధిస్తున్నారు. లాక్ డౌన్ తో పాటుగా కర్ఫ్యూ కూడా అమల్లోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.