లబ్దిదారుల జాబితాలోంచి తొలగించారని అనేకమంది గగ్గోలు పెడుతున్నారు

కాకినాడ సిటీ జనసేన పార్టీ ఇన్చార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముత్తా శశిధర్ ఆదేశాల మేరకు నాదెండ్ల మనోహర్ మాట కాకినాడలో అందరి నోట అనే కార్యక్రమాన్ని 41 డివిజన్లో గాంధీనగర్ రైతుబజార్ సెంటర్లో ఆకుల శ్రీనివాస్ & మనోహర్ లాల్ గుప్తాల ఆధ్వర్యంలోను మరియు 44వ డివిజన్లో మెహర్ నగర్లో బుర్రయ్యకపు వీధి దగ్గర రావిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మొత్తం అవినీతి కూపంలో కూరుకుపోయిందన్నారు. సుమారు 3 లక్షల కోట్లు పధకాల నిమిత్తం పంపిణీ చేసామంటున్నారనీ, కానీ పేద ప్రజలు అనేకమంది మమ్మల్ని లబ్దిదారుల జాబితాలోంచి తొలగించారని గగ్గోలు పెడుతున్నారనీ మరి ఆ నిధులు ఏమవుతున్నాయో అర్ధంకావట్లేదని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు సుమారు 12 లక్షల కోట్లు అయ్యాయనీ మరి మిగిలిన లక్షలాది కోట్లు ఎవరి జేబులోకి మళ్ళాయని ప్రశ్నించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కేంద్ర సంస్థ లెక్కలు అడిగినా చెప్పరు, ప్రజలకీ లెక్కలు చెప్పరు మరి అసలు గుట్టు పెరుమాళ్ళుకెరుక లాగ ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ అవినీతి వై.సి.పి ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో తిరస్కరించాలన్నారు, ఈదిశగా ఉమ్మడిగా తాము తెలుగుదేశం పార్టీలు కృషిచేస్తున్నాయని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, ముమ్మడి కోటేశ్వరరావు, దారపు సతీష్, బట్టు లీల, బండి సుజాత, బోడపాటి మరియ, సోనీ ఫ్లోరెన్స్, ధనలక్ష్మి, చొడిపల్లి సత్యవతి, ఉమా, తుమ్మలపల్లి సీతారాం , ముమ్ముడి రాంబాబు, గరగ శ్రీనివాస్, తుమ్మలపల్లి వీరభద్రరావు , శెట్టి జోగిరాజు, కంచుమర్తి గంగాధర్, అప్పన సుధీర్, తోరం చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.