అంగన్వాడి హెల్పర్స్ సంఘాల ధర్నాకు జనసేన మద్దతు

పోలవరం: జీలుగుమిల్లి తాసిల్దార్ కార్యాలయం వద్ద గత మూడు రోజుల నుంచి అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్నటువంటి ధర్నాలో భాగంగా గురువారం జనసేన పార్టీ జీలుగుమిల్లి మండల అధ్యక్షులు పసుపులేటి రాము ఆధ్వర్యంలో ధర్నాలో పాల్గొని మద్దతు తెలపడం జరిగింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్స్ ను ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని, వారికి కనీస వేతనం 26000 ఇవ్వాలని, 2022 సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యూటీ అమలు చేయాలని మినీ సెంటర్లను మెయిన్ సెంటర్ గా మార్చాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ అయిదు లక్షలు పెంచాలని తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టడం జరిగిందని తమ డిమాండ్లు తీరేవరకు ధర్నా ఆప బోమని, ప్రభుత్వం చేసిన అన్యాయానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని తెలిపారు. తమ మద్దతు తెలిపిన జనసేన పార్టీనాయకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూపా సత్యనారాయణ, కోలా మధు, ఉలవల శివ, అజయ్, శేఖర్, సాయి కార్యకర్తలు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.