మాడుగులలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కు దారేది కార్యక్రమం

మాడుగుల నియోజకవర్గం: మండలంలో ఘాట్ రోడ్డు జంక్షన్ నుంచి సురవరం గ్రామం వరకు అధ్వాన్నంగా ఉన్న రోడ్లమీద జనసేన పార్టీ సమన్వయకర్త రాయపురెడ్డి కృష్ణ మరియు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త పివిజి కుమార్ ఆధ్వర్యంలో శనివారం 4 మండలాల జనసేన మరియు తెలుగుదేశం నాయకులు సమక్షంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది అనే కార్యక్రమం సురవరం ప్రధాన రహదారిపై ఇరు పార్టీ నాయకులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త రాయపురెడ్డి కృష్ణ మాట్లాడుతూ ఒక్క మాడుగుల నియోజకవర్గంలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రధాన రహదారులపై కూడా రవాణా సౌకర్యం అస్తవ్యస్తంగా తయారయ్యి గర్భిణీ స్త్రీలకు గాని ప్రజలకు గాని చాలా ఇబ్బందులు గురవుతున్నారని రవాణా సౌకర్యం సక్రమంగా లేకపోవడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి కూడా గండి పడుతుందని, మాడుగుల నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు బూడి ముత్యల నాయుడు కళ్ళు మూసుకొని ఉన్నారా లేకపోతే గాఢ నిద్రలో ఉన్నారా అని చెప్పి ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పివిజి కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నం నుంచి పాడేరుకు వెళ్లే ప్రధాన రహదారి ఇది ఇటువంటి రహదారిని కూడా కొత్త రోడ్డు వేయడానికి నిధులు లేకపోతే కనీసం మరమ్మత్తులు చేయడానికి అయినా సరే ఈ వైసీపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయి ఉండి కూడా నియోజకవర్గంలో రోడ్లమీద కనీసం దృష్టి సారించకపోవడం చాలా దుర్మార్గమని అందుకే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఈ యొక్క రోడ్ల కోసం నిరసన కార్యక్రమం చేశామని మీడియా మిత్రులు అలాగే జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు సమక్షంలో తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గ వీరమహిళ శ్రీమతి వీర సురేఖ, మాడుగుల మండల నాయకులు గండెం రాంబాబు, రోబ్బా మహేష్, కోళ్ల చిన్న, కోన శ్రీనివాస్, తాడికొండ రామకృష్ణ, కోటపాడు సత్యనారాయణ, బంకు బలరాం, దాసరి చిత్రం గుమ్మాల అప్పలనాయుడు, సురవరం పిల్ల నాయుడు, నానాజీ, చింతలూరు మూర్తి, సాయం రమేష్, దయ యాదవ్, కేమిసెట్టి గణేష్, బంటు, నాగరాజు, కొట్ని రమేష్, శ్రీను, వల్లపురం, చీడికాడ మండలం నాయకులు, గంటల వరహామూర్తి, గుమ్మడి సంతోష్, (వైస్ ప్రెసిడెంట్) దిబ్బపలెం రాము, తులసిరాం, దేవరపల్లి మండల నాయకులు, మునకలపల్లి సురేష్ అదేవిధంగా నాలుగు మండలాల ముఖ్య నాయకులు సీనియర్ జనసైనికులు పాల్గొన్నారు.