వైసీపీ ప్రభుత్వంలో చేనేతలకు మొండిచేయి

  • చేనేత కార్మికులకు అండగా ఉంటాం
  • సిద్ధవటం జనసేన నేతలు

రాజంపేట: వైసిపి ప్రభుత్వం చేనేతలకు మొండి చేయి చూపిందని చేనేత కార్మికులకు జనసేన పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య, సిద్ధవటం జనసేన ఇన్చార్జి కొట్టే రాజేష్ పసుపులేటి కళ్యాణ్ అన్నారు. శనివారం సిద్ధవటం మండల పరిధిలోని పార్వతీపురం, మాధవరం, ఉప్పరపల్లి గ్రామాల్లోని చేనేత కార్మికుల మగ్గాల వద్దకు వెళ్లి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ రూపొందించిన చేనేత కార్మికుల మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం చేనేత కుటుంబాలను ఆదుకుంటామని చెప్పి నట్టేట ముంచిందన్నారు. చేనేత ముడి సరుకులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల పనులు లేక చేనేత కార్మికులు జీవనోపాధికి దూరమయ్యారన్నారు. చేనేత కార్మికులకు అందించే నేతన్న నేస్తం కింద 24 వేల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం వాటా12 వేల రూపాయలు అందిస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం 24 వేల రూపాయలు అందిస్తున్నామని పబ్లిసిటీ చేసుకుంటుందన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై రాష్ట్ర అధినాయకుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. జనసేన పార్టీ అధికారంలో లేకున్నా ఎన్నో సేవా కార్యక్రమాలు, రైతు కుటుంబాలను ఆదుకుంటున్నామన్నారు. వర్షాలు వస్తే చేనేత మగ్గాల గుంతల్లోకి నీరు చేరి జీవనోపాధికి దూరమవుతున్నారన్నారు. 2024లో జనసేన టిడిపి కూటమిలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక చేనేత కార్మికులకు ఉచిత విద్య హెల్త్ కార్డులు ఆర్థిక చేయూత ముడి సరుకులు మగ్గాల మీద సబ్సిడీ పెన్షన్ సబ్సిడీతో కూడిన రుణాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చేనేత కార్మికులను ఆదుకొని ముడి సరుకులపై సబ్సిడీ ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభ ఎలక్షన్ లో జనసేన టిడిపి కూటమి అధికారంలోకి రాబోతుందని చేనేత కార్మికులను ఆదుకుంటామని నేతన్నలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆవుల రాజ, సుబ్బయ్య, అయ్యవారయ్య, జనసేనవీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.