కూటమి గెలుపుతో వాలంటీర్ల వేతనం 10వేలకు పెంపు

  • పొత్తు గెలవాలి.. పాలన మారాలి

కాకినాడ రూరల్: జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాలంటీర్లకు 10వేలు గౌరవ వేతనం అందించనున్నామని, గ్రామ వాలంటీర్లు అధైర్యపడవద్దని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు (నానాజీ) అన్నారు. మంగళవారం కాకినాడ రూరల్లోని 50వ డివిజన్ లో స్థానిక జనసేన, టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో
టీడీపీ కాకినాడ రూరల్ కో – ఆర్డినేటర్ మాజీ శాసనభ్యులు పిల్లి అనంత లక్ష్మి సత్యనారాయణ మూర్తి దంపతులు, టీడీపీ కో- కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ గార్లతో కలిసి ఇంటింటా ప్రచార కార్యక్రమం చేపట్టిన జనసేన, టిడిపి, బిజెపి ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం నానాజీ గాజు గ్లాస్ గుర్తుకు కు ఓటు వేసి, గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడుతూ విశేష స్పందన లభిస్తోందన్నారు. జగన్ అరాచక పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో కూటమి ఏర్పడిందన్నారు. పొత్తును ప్రజలే కోరుకున్నారని, ప్రజలే విజయాన్ని అందించేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో వైసిపి పాలనలో రాజకీయ నాయకులు, ప్రజలు ప్రశ్నించే హక్కు కోల్పోయారన్నారు. జగన్ అన్యాయంగా, అక్రమంగా దోచుకున్న డబ్బుతో రానున్న ఎన్నికల్లో గెలిచే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోనికి రాగానే జూన్ నెల నుండి నెలకి 4 వేలు వృద్ధాప్య పెన్షన్ లు అందించనున్నామని, రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూటమిని బలపరచి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు నూరుకుర్తి వెంకటేశ్వరరావు, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మరియు జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.