వావిలాల ఘాట్ నిర్వాసితులకు పునరావాసంతో పాటు కనీసవసతులు కల్పించాలి: బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం: సత్తెనపల్లి పట్టణంలోని వావిలాల ఘాట్ సమీపంలో ఉండే 150 నిరుపేద కుటుంబాలను ఆరో వార్డు సమీపంలోకి తరలించిన గత ప్రభుత్వం. ఈ 150 కుటుంబాలకు సరైన పునరావాసము, కనీస వసతులు కల్పించలేదని జనసేన సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు అన్నారు. సుమారు 7సంవత్సరాల నుండి ఆరో వార్డులో నివాసం ఉంటున్న 150 కుటుంబాలు. ఒక్కో కుటుంబానికి ఒక సెంటు చొప్పున 1.50 సెంట్లను గత ప్రభుత్వం కేటాయించింది. కనీస సౌకర్యాలు లేకుండా పసిపిల్లలు, ముసలివారు, మహిళలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. సరైన రోడ్డు మార్గం, మరుగుదొడ్లు, సైడ్ కాలువలు, మంచినీటి సౌకర్యలు కల్పించమని, ప్రస్తుత ప్రభుత్వానికి అనేక వినతులు ఇచ్చినా కూడా పట్టించుకోవటం లేదు. ఈ కాలనీలో నివసించే కుటుంబాలలోని వృద్ధులు, మహిళలు, పసిపిల్లలు తరచూ అనారోగ్య పాలవుతున్నారు. ఒకపక్క దోమలు, మరో ప్రక్క సైడ్ కాలువలులేక పారిశుద్ధ్యత లోపం వలన మలేరియా, విష జ్వరాలు అనేక రోగాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న ఈ కాలనీవాసులు. అయితే ఈ కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను జనసేన పార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు దృష్టికి కాలనీ వాసులు తీసుకు రావడంతో, ఆయన ఈ కాలనీని సందర్శించి, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న బొర్రా వెంకట అప్పారావు. కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలను వారంలోపు పరిష్కారం చూపాలని స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుకి అల్టిమేటం జారీ చేశారు బొర్రా.. వారం తర్వాత కూడా ప్రభుత్వం ఈ కాలనీవాసులకు ఎటువంటి సౌకర్యాలను కల్పించలేదు.. దీంతో వారం తరువాత జనసేన పార్టీ తరపున ఈ కాలనీకి మట్టి రోడ్డు, సైడ్ కాలువలు, ఏర్పాటు చేస్తానన్నారు బొర్రా.. కాలనీ వాసులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం.. కాలనీలోని ముళ్ల చెట్లు, జమ్ము, గోతుతులను జేసీబీ ద్వారా బాగు చేసే పనిలో నిమగ్నమైన బొర్రా. ఈ సందర్బంగా బొర్రా మాట్లాడుతూ.. ఇటీవల వచ్చిన తుఫాన్ ప్రభావంతో ఆరో వార్డులోని కాలనీవాసులు (వావిలాల ఘాట్ నిర్వాసితులు) ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూసి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుకి సామాజిక మాధ్యమాల ద్వారా ఈ కాలనీ వాసుల ఇళ్లలోకి వర్షం వచ్చినప్పుడు వర్షపు నీళ్లు ఇళ్లలోకి వచ్చి తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, సైడ్ కాలువలు లేక వర్షపు నీరు, మురుగునీరు ఇళ్ళ మధ్య చేరటంతో ముళ్ళ కంపులు, జమ్మూ పెరిగి దోమలు, విషసర్పాల ప్రభావంతో ఈ కాలనీ వాసులు ఆరోగ్యం బారిన పడుతున్నారని, వీరికి రోడ్లు కనీస వసతులు వారం లోపు కల్పించాలని ఆయనకు తెలియజేశాం. వారం తరువాత కూడా ఎటువంటి చలనం మంత్రి అంబటి రాంబాబులో రాలేదు. వారం రోజుల తరువాత జనసేన పార్టీ తరపున మేము నిన్న జెసిబి తీసుకొని వస్తుంటే అనేక ఇబ్బుందులకు గురించేశారు. ఎట్టి పరిస్థితితులలో ఈ కాలనీ వాసులు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చాలని ఈ రోజు జెసిబి ద్వారా సైడ్ కాలువల పూడిక, ముళ్ళకంప, జమ్ము తొలగించే ప్రక్రియను ప్రారంభించాము. కాలనీవాసులకు ఇచ్చిన మాట ప్రకారం మట్టి రోడ్డు కూడా ఏర్పాటు చేస్తాం, మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని కాలనీ వాసులకు అభయం ఇచ్చారు బొర్రా. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమిశెట్టి సాంబశివరావు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యుడు భత్తుల కేశవ, సత్తనపల్లి మండల అధ్యక్షుడు నాదెండ్ల నాగేశ్వరరావు, నాయకులు చిలక పూర్ణ, చిలక సత్యం, తదితర జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.