మృతుని కుటుంబానికి డాక్టర్ కందుల చేయూత

  • ఆర్థిక సహాయం చేసిన డాక్టర్ కందుల
  • ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుంటానని వెల్లడి
  • నిస్వార్థ సేవలు అందించడమే తన లక్ష్యమన్న డాక్టర్ కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా వారిని ఆదుకునేందుకు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఇప్పటికే నిర్విరామంగా ఎంతో మందికి సేవలు అందజేసినట్లు చెప్పారు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్కడికి తాను వెళ్లడం జరుగుతుందని చెప్పారు. వారి సమస్యను తన సమస్యగా భావించి వారికి ఒక కుటుంబ సభ్యుడిగా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటూ వారిని ఆదుకోవడం తన కర్తవ్యం గా భావిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం 34వ వార్డు తారకరామ కాలనీలో మృతి చెందిన ప్రకాష్ కుటుంబానికి డాక్టర్ కందుల నాగరాజు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఆయనకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆదేశాల మేరకు నిర్విరామంగా పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. పార్టీ స్థానిక నాయకత్వం తను చేస్తున్న కార్యక్రమాలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. అర్హులైన పేద వారందరికీ తన సహాయం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గంలోని పలు వార్డులలో ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉన్నట్లు చెప్పారు.
వృద్ధులకు, మహిళలకు, చీరలు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పుష్పవతి అయిన అమ్మాయిలకు పెళ్లి కుమార్తెలకు పట్టుబట్టలు, బంగారు తాళిబొట్లు, వెండి పట్టీలు అందజేయడం జరిగిందని తెలిపారు. నిరుపేద విద్యార్థులకు అండగా నిలవడం జరిగిందని. అలాగే వికలాంగులకు వీల్ చైర్ లను పంపిణీ చేశామని చెప్పారు. నియోజవర్గంలో తన సేవలు నిర్విరామంగా కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఉమ్మడి గురుమూర్తి, లుక్స్ గణేష్, ఎన్ లక్ష్మణ, ప్రసాద్, కృష్ణ, రాజు, భారతి, పతిపాడ చిన్ని, వెంకటేష్, నియోజకవర్గం జనసేన యువనాయకులు కందుల బద్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.