కాకినాడ జనసేన ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పోరాట యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో డివిజన్ నాయకులు అగ్రహరపు సతీష్ & గరగా శ్రీనివాసుల ఆధ్వర్యంలో 44వ డివిజన్ శారదా దేవి గుడి ప్రాంతం దగ్గర ప్రజా చైతన్య పోరాటం యాత్ర జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాంతంలో తిరుగుతూ ప్రజా సమస్యలను వాకబు చేసారు. రావెల చక్ర రావు అనే ఆయన తన పొలానికి సంబంధించి అనేక సమస్యలు ఈ ప్రభుత్వం పరిష్కరిచట్లేదన్నారు. రమణమ్మ అనే ఆమె ఒంటరి మహిళ పించను రాడంలేదనీ, రమ్య అనే నిరుద్యోగి ఉద్యోగం లేదని తమ సమస్యలను వాపోయారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇవే కాకుండా నగర నడిబొడ్డులో ఉన్న ఈ డ్రైను సమస్యని పరిష్కరించట్లేదనీ తుఫాను వానలు వచ్చినప్పుడు ముంపుకు గురవ్వుతున్నామన్నారు. ఇదే కాక ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయనీ దీనికి శాశ్వత పరిష్కారం అవసరమన్నారు. స్మార్ట్ సిటి నిధులని ఉపయోగించి ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికీ, అభివృద్ధికీ పాటుపడాలని డిమాండ్ చేసారు. ఒకనాడు భవన నిర్మాణ కార్మికులతో నిత్యం కళకళలాడుతూ ఉండే ఈ ప్రాంతం నేడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన స్వార్ధ కుతంత్రానికి ఇసుక లభ్యత కష్టమై కునారిల్లి చిన్నాభిన్నమైందనీ వీళ్ళ ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఎన్నికలప్పుడు తప్ప ప్రజాప్రతినిధులు ఇక్కడ కనపడటంలేదని ప్రజలు తమ ఓటు వినియోగించుకుని తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిటి ఉపాధ్యక్షులు అడబాల సత్యన్నారాయణ, అగ్రహారపు సతీష్, గరగా శ్రీనివాసు ఆధ్వర్యంలో, రామిరెడ్డి నగేష్, చిరంజీవి, రావిపాటి వెంకటేశ్వర రావు, బండి సుజాత, యేలేటి సోనీ ఫ్లోరెన్సు, బోడపాటి మరియ, సబ్బే దీప్తి, గంజా మంగ, దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు.