సమాజ సేవకు అంకితమైన మెగా కుటుంబం

  • జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ విజయం తెలుగువారందరికి గర్వకారణం
  • గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు, తెలుగు సినిమా కీర్తిని, ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన మెగా కుటుంబం సమాజ సేవలోనూ అందరికి ఆదర్శంగా నిలుస్తుందని గుంటూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. సోమవారం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సినీ జగత్తులో మెగా ఫ్యామిలీది సువర్ణాక్షరాలతో లికించదగ్గ చరిత్ర అంటూ కొనియాడారు. సినీ పరిశ్రమలో రికార్డులు సృష్టించటం ఆ రికార్డులను తిరగరాయటంలోనూ మెగా ఫ్యామిలీది పెద్ద రికార్డ్ అన్నారు. అల్లు అర్జున్ అనతి కాలంలోనే దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడన్నారు. పుష్ప సినిమాలోని నటనకు జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డ్ అందుకోవడం తెలుగువారిగా ప్రతీ ఒక్కరికీ గర్వకారణం అంటూ ప్రశంసలు గుప్పించారు. అత్యున్నత స్థాయి విజయాలు సాధిస్తూ కూడా గర్వాన్ని కించిత్ కూడా తలకెక్కించుకోని అల్లు అర్జున్ ను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్, జనసేన నగర అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, టీడీపీ నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, భరత్ రెడ్డి, షర్ఫుద్దీన్, సోమి ఉదయ్, నాజర్ వలి, స్వామి, అబ్దుల్ కలాం, షేక్ శుభాని, మల్లీశ్వరి, గడదాసు అరుణ, మాదాసు శేఖర్, ఏడుకొండలు, జడ సురేష్, రజాక్, జగన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.