బీసీ సంక్షేమ సంఘ ప్రెసిడెంట్ గా దూదేకుల సలీమ్ నియామకం

గురజాల నియోజవర్గం: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గురజాల నియోజవర్గం వర్కింగ్ ప్రెసిడెంట్ గా దూదేకుల సలీమ్ నియమించబడ్డారు. పిడుగురాళ్ల పట్టణంలోని షాదీఖానాలో జరిగిన బిసి సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో నియామక పత్రాన్ని పల్నాడు జిల్లా అధ్యక్షులు యామ మురళి, రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నల శ్రీనివాసరావు, పట్టణ అధ్యక్షులు యడవల్లి ఏడుకొండలు గౌడ్ చేతులమీదుగా అందచేశారు, ఈ సందర్భంగా సలీమ్ మాట్లాడుతూ బీసీలు యొక్క ఐక్యత కొరకు కృషి చేస్తానని, నాకు ఇచ్చిన పదవిని బాధ్యతగా నిర్వహిస్తానని తెలియజేశారు.