సీటుపై అపోహలు, ఆందోళనలు వద్దు

  • తిరుపతి జనసేన-టిడిపి ఉమ్మడి అభ్యర్థిని ఇరు పార్టీల అధ్యక్షులు ప్రకటిస్తారు..
  • ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కాం
  • ఆర్జీవి ఒక పిచ్చోడు. సొంతం చెల్లెనే పక్కన పెట్టిన జగన్ తెలిసి రోజాకి సీట్ ఎందుకు ఇస్తాడు – కిరణ్ రాయల్.

తిరుపతి, వైసీపీ చేపట్టిన ఆడుదాం ఆంధ్ర అనేది పెద్ద స్కామ్ అని ఓ అధికారి స్వయంగా మా దృష్టికి తీసుకువచ్చారని దీనిపై రేపు మా ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర విచారణ చేపట్టి ఈ స్కాం తాలూకా వివరాలను బయటపెడతామని, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి, సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎంప్లాయీస్ గత కొంతకాలంగా మాకు న్యాయం చేయండి మహాప్రభో అని నిరసనలు వ్యక్తం చేస్తుంటే అధికార పార్టీ నిమ్మకు నీరేత్తినట్లుగా, పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర ప్రజలను ఉద్యోగులను దృష్టి మళ్లించడానికి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం చేపట్టారని కిరణ్ రాయల్ బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో అధికార పార్టీని విమర్శించారు. తిరుపతి సీటుపై అపోహలు ఆందోళనలు వద్దని, జనసేన టిడిపి మీరు పార్టీల అధ్యక్షులు సీటు ఎవరికో త్వరలోనే ప్రకటిస్తారని, స్థానిక జనసేన ఇన్చార్జ్ గా సీటును మేము కూడా ఆశిస్తున్నామని, టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరైనా అందరం ఇష్టపడి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తిరుపతిలో కార్యకర్తలు తొందరపడి బొకేలకు పూలమాలలకు డబ్బులు వృధా చేసుకోవద్దని, టిడిపి జనసేన తిరుపతిలో బలంగా ఉన్నాయని తెలియజేశారు. ఆర్జీవి ఒక పిచ్చోడు నిజంగా మగాడు అయితే టిడిపి జనసేన కార్యకర్తలు అతని ఆఫీస్ వద్దకు వెళ్ళినప్పుడు తలుపులు వేసుకొని లోపల దాంకపోవడం ఎందుకని, రోజా, ఆర్జీవి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, ఈసారి రోజాకు నగిరి లో సీటు లేదని, సొంత చెల్లినే పక్కన పెట్టిన జగన్ ఓడిపోద్ది అని తెలిసి రోజాకు సీటు ఎందుకు ఇస్తాడన్నారు. పవన్ కళ్యాణ్ పై విమర్శలు మాని, ఆర్జీవి రోజాలకు అంత ప్రేమ ఉంటే రోజా, అంబటి రాంబాబు లను పెట్టి వైసీపీ గోవిందా గోవిందా టూ సినిమా తీసి అందులో అందమా అందమా పాట బదులు మందమా మందమా అని తీసుకోండి మాకేం నష్టమని కిరణ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ మీడియా సమావేశంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు బాబ్జి, కమిటీ సభ్యులు కొండ రాజమోహన్, గుట్టా నాగరాజు, వినోద్, వంశీ, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.