ఆడుదాం ఆంధ్రా పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం

  • ఎవరు వేసిన రోడ్ల మీద బస్సు యాత్రలు చేస్తున్నారు?
  • ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణ చేసిన జనసేన పార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్

పాడేరు నియోజకవర్గం: వైసీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజధనాన్ని వృధా చేస్తుందని జనసేన పార్టీ రూరల్ జిల్లా జాయింట్ సెక్రెటరీ కిల్లో రాజన్ ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రకరకాల పేర్లు పెట్టి ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు, ఉద్యోగాలు తీయరు మీరిచ్చిన హామీలు నెరవేర్చరు, ఉద్యోగాలు తీయారు ఉన్న ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వరు, కానీ నిరుద్యోగులను రొడ్డుకీడ్చి ఆడుదాం ఆంధ్రా పేరుతో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం, ఆడుతున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? చెమట ఓడ్చి కొండంత ఆశలు పెట్టుకొని అప్పులుచేసి పిల్లలను చదివించిన తల్లితండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చారు, పనికి మాలినపేర్లతో మీ రాజకీయ ప్రోపగాండా ను అమలుచేస్తూ మళ్ళీ ఓట్లు కోసంప్రజలను మభ్య పెట్టడం చేస్తున్నారు, ప్రజాధనాన్ని వృధా చేయటం ఇకనైనా ఆపండి కొంతైనా మిగిల్చిండి, నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజల జీవితాలతో ఆడేసుకున్నారు. ఇక చాలు చాలు మీ దాగుడుమూత దండాకోరు ఆటలు, నిరుద్యోగులు, కార్మికులు, ఏడుస్తుంటే.. చిరు ఉద్యోగులు సైతం మీరు ఇచ్చినహామిలకోసం కడుపు చేతపట్టుకొని ఆకలి చాలువులతో రోడ్లమీద నిరసనలు తెలుపు తుఒటే.. కనీసం మీ మనసుకు గోరంత బాధకలగలేదా.. వాళ్ళబాదను పక్కనపెట్టి యాత్రలు, పుట్టిన రోజు పండగలు, కోట్లాది రూపాయిలు, వెచ్చిఒచి, ఎంజాయ్ చేస్తున్నారు.. ఆకరికి ఆడుదాం ఆంధ్రా పేరుతో ప్రజలను పిచ్చివాళ్లని చేస్తారా.. మీ ఆడుదాం ఆంధ్రాలు కేవలం యువత తీవ్రమైన తిరుబాటును చూసి భయంతో, వేస్తున్న ఎర.. యువత దృష్టిని మీ వైపు మరల్చడం మీ తరంకాదు, యువత మార్పుకోసం నాందిపకులుకు తున్నారు. జనసేన వైపు అడుగులు వేస్తున్నారు, మీరు వేస్తున్న ఆటల బిస్కెట్ నీ ఎప్పుడో అర్దమ్ చేసుకొన్నారు. ఒక మంత్రి ఉన్నాడు అంగనవాడి స్టాప్ నీ, బెదిరిస్తూ, నిరసన విరమించకుంటే ఉద్యోగాలు ఉండవ్ అని బెదిరిస్తాడు, ఉద్యోగాలు, పొందడం తగు తేతనాలకోసం, పోరాటం చేయటం, వారి రాజ్యాంగఒ కల్పించిన హక్కు, ఆ హక్కును హరించే రైట్ ఎవరికీ లేదు, 3 నెలలు ఆగితే వాళ్ళే మిమ్మల్ని ధర్మంగా మీ ఇంటికి పంపుతారనే విషయాన్నీ క్షుణ్ణంగా తెలసుకోవాలి, కనీసం ఇప్పటికైనా ఇచ్చిన హామీల్లో కొన్నింటికైనా.. నెరవేర్చి ఓటువేసి ప్రజలకు రుణం తీర్చుకోవాలని, హితువు పలుకుతున్నాం, రాష్ట్రమంతటా ఇన్ని వర్గాల ఉద్యోగులు, కార్మికులు, నిరుద్యోగులు, ఉద్యమాలు పెద్ద ఎత్తున, ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని తెలియజేస్తూ, నిరసనలు, పోరాటాలు చేయటం ఇదే మొదటిసారి. ఇది వైసీపీ ప్రభుత్వం అంతటి అదృష్టాన్ని కలుగ జేసుకుంది, ఆకరికి ఆంధ్రాని రాజధాని లేని రాష్ట్రంగాచేసి చరిత్ర సృష్టించింది.