భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ కి హామీ యాత్రా కార్యక్రమం 44 వార్డ్, మహాత్మ వీధి ప్రాంతంలో అగ్రహారపు సతీష్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ శ్రేణులు భవన నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారి కష్టాలపై సమాచారం అడిగి తెలుసుకున్నారు. నేడు ఈ వై.సి.పి ప్రభుత్వ లోపభూఇష్టమైన విధి విధానాలతో భవన నిర్మాణ రంగం కుదేలు అయిపోయి పతనావస్థకి చేరుకుందన్నారు. ధరల ప్రభావం వల్ల సామాన్య ప్రజలు సొంత ఇంటి కల కలగానే మారిందనీ ఇంకో పక్క ప్రభుత్వ కాంట్రాక్టుల బిల్లులు చెల్లించడంలేదని కాంట్రాక్టర్లు కొత్తపనులు చేపట్టడం లేదని దీని ప్రభావంతో కొన్ని లక్షల కుటుంబాలు వీధినపడ్డాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సు కోసం జనసేన పార్టీ తెలుగుదేశంలు ఉమ్మడి మేనిఫెస్టోలో ఉచిత ఇసుక విధానంతో పాటుగా ముఖ్యమైన ప్రతిపాదనలు చేపడుతున్నాయని కార్మికులకు పనిభద్రత దిశగా చర్యలు చేపడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రామిరెడ్డి నాగేష్, దుర్గ, శ్రీనివాస్, మురళి తదితరులు పాల్గొన్నారు.