పొందూరు మండలంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం

*జనసేనలో చేరిన 50 కుటుంబాలు

ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలంలో నందివాడ మరియు నరసాపురంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో జనసైనికులతో కలిసి పాల్గొన్న ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్, జనసేన దళం వన్నెఒరెడ్డి సతీష్ కుమార్ మరియు నియోజకవర్గ ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు. అనంతరం ముఖ్య అతిథులు సుమారు 50 కుటుంబాలను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పొందూరు జడ్పిటీసి అభ్యర్థి అసిరినాయుడు, సరుబుజ్జిలి జడ్పిటీసి అభ్యర్థి మురళీమోహన్, పొందూరు మండల జనసేన నాయకులు రమణ, చిన్నఒ నాయుడు, అప్పలనాయుడు, సతీష్, లక్ష్మణ, హరి, బాబురావు మరియు జనసైనికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.