పోలవరం మండల కేంద్రంలో జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

పోలవరం: పోలవరం మండల కేంద్రంలో మండల గుణపర్తి వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా ఉమ్మడి బస్సు గోదావరి జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, పోలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి చిర్రి బాలరాజు పాల్గొని జనసేన పార్టీ మండల కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ప్రతి మండలాల్లో కార్యాలయాలను ప్రారంభిస్తున్నామని, కళ్యాణ్ గారి ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళడానికి అందరు కష్టపడాలని, సమయం తక్కువ ఉన్నందున ప్రతీ ఒక్కరం భాద్యతగా పని చేసి అధికారంలోకి రావడంలో భాగస్వాములవ్వాలని, అఖండ మెజారిటీ తీసుకువచ్చి పవన్ కళ్యాణ్ గారికి బహుమతి ఇవ్వాలని, అసమర్థ పాలనకు చరమ గీతం పాడాలన్నారు. ఎమ్మెల్యే చేతకానితనం, అసమర్ధత వల్లే టికెట్ కూడా ఇవ్వలేదని, ఇతరులు పోటీచేయ్యకుండా తన భార్యకే టికెట్ తెచ్చుకున్న ఎమ్మెల్యే అని ఏద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి పాదం కృష్ణ, మద్దు తేజా, పసుపులేటి రాము, తోట రవి, మెట్ట బుచ్చిరాజు గారు, మేక రామ్మోహన్, భువనేశ్వరి, తెలగం శెట్టి రాంప్రసాద్, కురసం రమేష్, చీకట్లో సాయి కృష్ణమూర్తి, మామిడిపల్లి వరప్రసాద్, వనిమిరెడ్డి సీతయ్య, మామిడిపల్లి వెంకట స్వాతి, మల్లాడి సునీల్, కిషోర్, రాధాయ్య, మండల కమిటీ గ్రామ కమిటీ సభ్యులు, రెండు రాష్ట్రాల ఉత్తమ రైతు అవార్డు గ్రహీత ఉప్పల సత్యనారాయణ, అడ్వకేట్ తొర్లపాటి సీతాల్ గారు నాయకులు, వీరమహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.