ఇంటింటికి తెలుగుదేశం-జనసేన

పుంగనూరు, గురువారం చల్లా రామచంద్ర రెడ్డి, పగడాల రమణల ఆధ్వర్యంలో ఇంటింటికి తెలుగుదేశం-జనసేన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మొదటిరోజు పర్యటనలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం, పుంగనూరు మండలం వనమాలధీనే పంచాయితీలో టీడీపి ఇంచార్జీ చల్లా రామచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి పగడాల రమణ పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది అని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన-టిడిపి మండల అధ్యక్షులు మాధవ్ రెడ్డి, విరూపాక్ష, జిల్లా పోగ్రామ్స్ కార్యదర్శి చైతన్య రాయల్, టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, ప్రధాన కార్యదర్శి హరీ నాయక్, బాలాజీ నాయక్, నాయకులు మురళి రాయల్, సుబ్బు, గని, రమేశ్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.