ఈవిఎంల పరిశీలనలో పాల్గొన్న రాందాస్ చౌదరి

మదనపల్లి మండలం, పప్పిరెడ్డి పల్లిలో 15,16 వ పోలింగ్ బూత్ లలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ లను ఎన్నికల అధికారుల సమక్షంలో డెమో కార్యక్రమం జరిగింది. జనసేన పార్టీ రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి మరియు జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి పరిశీలించారు. ఎన్నికల అధికారులు రాజకీయ పార్టీ నాయకులకు, ప్రజలకు ఈవిఎంల గురించి ఓటు ఎలా వేయాలి వేసిన ఓటు ఎలా చెక్ చేసుకోవాలో చాలా క్లుప్తంగా వివరించడం జరుగుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో, భవిష్యత్తు బాగుంటుందో, ఆ పార్టీకి స్వచ్ఛందంగా ఓటు వేసే వెసులుబాటు ఎన్నికల సంఘం కల్పిస్తుంది కాబట్టి ప్రజలు అందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని జనసేన పార్టీ తరుపున పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, తోట కళ్యాణ్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, పట్టణ ఉపాధ్యక్షులు కుమార్, ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్, ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ, సెక్రటరీ అర్జున, ఐటీ విభాగ నాయకులు లక్ష్మినారాయణ, ప్రధాన కార్యదర్శి పవన్ శంకర లవన్న, సెక్రటరీ జనార్దన్, రెడ్డి శేఖర్ రెడ్డి, సెక్రటరీ జయశేఖర్, గుజిని శీనా తదితరులు పాల్గొన్నారు.