కంచికచర్ల లో లారీకి మరమ్మత్తు చేస్తుండగా ప్రమాదం

కృష్ణాజిల్లా నందిగామ: కంచికచర్ల పట్టణం లో 14చక్రల లారి వీల్స్ కు గ్రీస్ పెట్టేందుకు లారీ కింద జాకీలు మోపు చేసి మెకానిక్ లారీకి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా జాకీలు కుంగిపోయి లారీ పల్టీ కొట్టడంతో లారి మెకానిక్ యేసు లారి కింద ఇరుక్కుపో పోయాడు. తక్షణమే కంచికచర్ల గ్రామీణ సీఐ కె సతీష్, ఎస్ఐ 2 లక్ష్మి, కంచికచర్ల పోలీస్ సిబ్బంది, నేషనల్ హైవే పెట్రోలింగ్ ఏఎస్ఐ చాప నాగరాజు,  హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కంచికచర్ల పట్టణ ప్రజల సహాయంతో భారీ క్రైన్లతో లారిని పైకి లేపి ఇరుక్కుపోయిన మెకానిక్ బయటకు తీసారు. వైద్య చికిత్స నిమిత్తం నేషనల్ హైవే అంబులెన్స్ లో నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

ఈ సందర్భంగా కంచికచర్ల గ్రామీణ ప్రాంత సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు…